వెల్లువెత్తిన అభిమానం | - | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన అభిమానం

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

వెల్లువెత్తిన అభిమానం

గుమ్మలక్ష్మీపురం:

మండలంలోని ఎల్విన్‌పేట తాజా మాజీ సర్పంచ్‌ ఆర్‌.ఎస్‌ చైతన్య స్రవంతి తన అభిమాన నేతలైన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిలపై ఉన్న ప్రేమాభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. సిక్కిం రాష్ట్రంలో అత్యంత ఎత్తులో (సముద్ర మట్టానికి 4,310 మీటర్లు) ఉన్న పర్వత కనుమ అయిన నతులా పాస్‌లో (సైనిక పోస్ట్‌ సమీపంలో) అభిమాన నాయకుల ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. 2029లో తాను ఎంతో అభిమానించే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా, పాముల పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. తద్వారా పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ మంచి జరగాలని స్రవంతి ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement