ఆశీర్వదించండి.. | - | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి..

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

ఆశీర్వదించండి..

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి

కోలగట్ల శ్రావణి

పలు డివిజన్‌లలో కార్పొరేటర్‌

అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం

విజయనగరం: కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న తనను విజయనగరం ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాజీ డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి అన్నా రు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నగరంలో 5, 33, 39, 62, 42 డివిజన్‌ల లో కార్పొరేట్‌ అభ్యర్థులు కంటూమహంతి శ్రీనివాసరావు, ఎన్ని లక్ష్మణరావు, కనకల సూరప్ప డు, కిల్ల భవాని యాదవ్‌, రెడ్‌ గురుమూర్తిలతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచార సమయంలో ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ, హారతిలిచ్చి, విజయ తిలకాన్ని దిద్ది ప్రజలు ఆశీర్వదించారు. రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థు లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో విజయనగరంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. గత రెండున్నర ఏళ్లలో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును వివరించారు. ఎన్నికలకు ముందు నిత్యావసరాల ధరలు నియంత్రిస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నేడు అదే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతూ పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. కూటమి మోసాలను గుర్తించి ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement