వైఎస్సార్సీపీకి ఒక రూల్... టీడీపీకి మరో రూల్
మైకుల్లో రూల్స్.. నేతలొస్తే మినహాయింపులు
ఎన్నికల వేళ పోలీసులది రెండంచెల వైఖరి
పోలీసుల పక్షపాత తీరుపై విమర్శలు
విజయనగరం అర్బన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నిబంధనల అమలుపై పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. నామినేషన్ కేంద్రానికి 100 అడుగుల పరిధిలో అభ్యర్థితో పాటు ఇద్దరి కి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు మైకుల్లో పదేపదే హెచ్చరించారు. అయితే ఈ నిబంధన అమలులో పార్టీలను బట్టి భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేసిన పోలీసులు.. టీడీపీ అభ్యర్థి విషయంలో కూటమి నేతలు, మద్దతుదారులు పెద్ద సంఖ్య లో వచ్చినప్పుడు ఎందుకు అదే నిబంధనను అమలు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తాయి.
శ్రావణికి ఆంక్షలు.. భార్గవికి మినహాయింపులా?
వైఎస్సార్సీపీ మేయర్ అఽభ్యర్థి కోలగట్ల శ్రావణి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చినప్పుడు అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులు మాత్ర మే వెళ్లాలన్న నిబంధనను పోలీసులు పాటించారు. నిబంధన ప్రకారం ముగ్గురికే అనుమతి ఇచ్చి, ఆమెతో వచ్చిన మిగిలిన వారి ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు. ఆదివారం టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చి న సమయంలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పి.అదితిగజపతిరాజుతో పా టు మరో పది నుంచి 15 మంది మద్దతుదారులు నామినేషన్ కేంద్రం ప్రాంగణంలోకి ఎన్నికల ప్రచా రం మాదిరిగా చొరపడ్డారు. ఈ సమయంలోనూ పోలీసులు గత రోజు మాదిరిగా ఆంక్షలు అమలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.


