ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

ముగిసిన నామినేషన్ల పర్వం నామినేషన్ల ప్రక్రియ పరిశీలన

నామినేషన్ల వివరాలు...

మూడు పట్టణాల్లో ముగిసిన స్వీకరణ బొబ్బిలి, నెల్లిమర్లలో పోటాపోటీ చివరిరోజు కిక్కిరిసిన కేంద్రాలు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు నేడు నామినేషన్ల పరిశీలన

విజయనగరం అర్బన్‌:

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మూడు రోజుల పాటు కొనసాగింది. మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వార్డు సభ్యుల స్థానాలతో పాటు ఆయా పదవులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులతో నామినేషన్‌ కేంద్రాలు కిక్కిరిసాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 62 వార్డులకు, మేయర్‌ స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి మున్సిపాలిటీలోని 36 వార్డులకు ఆదివారం ఒక్క రోజే 101 నామినేషన్లు, చైర్మన్‌ పదవికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలిలో మొత్తంగా 36 వార్డులకు 190 నామినేషన్లు, చైర్మన్‌ పదవికి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లిమర్ల నగర పంచాయితీలోని 23 వార్డులకు 68 నామినేషన్లు, చైర్‌పర్సన్‌ పదవికి తొమ్మిది నామినేషన్లు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థుల నామినేషన్‌ పరిశీలన ప్రక్రియ సోమవారం జరుగుతుంది.

భారీ బందోబస్తు

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు. వాహనాలను కేంద్రాలకు దూరంగా నిలిపివేసి, రద్దీని నియంత్రించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు నామినేషన్ల స్వీకరణను పర్యవేక్షించారు. అధికార పార్టీ అభ్యర్థి నామినేషన్‌ వేసే విషయంలో వివక్ష చూపించారు.

విజయనగరం అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్‌.తేజ్‌భరత్‌, ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్‌.వెంకటేష్‌ ఆదివారం జిల్లాలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.రాంసుందర్‌రెడ్డిని కలిసి ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమ లు, చెక్‌లిస్ట్‌ ప్రకారం నామి నేషన్ల పరిశీలన తీరు పై రిటర్నింగ్‌ అధికారులను అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు వెంకటేష్‌ రెండు మున్సిపాలిటీల్లో అకౌంటింగ్‌ బృందాలతో సమావేశమై అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల నమోదు విషయంలో తగు సూచనలు చేశారు. నగరంలోని వీటీఅగ్రహారం వై జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన స్థిర నిఘా కేంద్రాన్ని కూడా పరిశీలించిన తేజ్‌ భరత్‌.. తనిఖీల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.

బొబ్బిలి: చైర్మన్‌ పదవికి 6

వార్డు సభ్యుల స్థానాలకు 190 నామినేషన్లు

నెల్లిమర్ల: చైర్‌పర్సన్‌ పదవికి 13

వార్డు సభ్యుల స్థానాలకు 139 నామినేషన్లు

విజయనగరం: మేయర్‌ 23

62 వార్డులకు 450 నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement