ఫ్లెక్సీ తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ తొలగింపు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

విజయనగరం ఫోర్ట్‌: పట్టణంలోని ఆర్‌అండ్‌బీ రైతు బజార్‌లో ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ సీఎం,మంత్రులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే అంశంపై శుక్రవారం రైతు బజార్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అనే శీర్షికన ప్రచురించిన కథనానికి రైతు బజార్‌ అధికారులు స్పందించారు. ఫ్లెక్సీలను, బియ్యం బస్తాలపై ఉన్న సీఎం, మంత్రుల ఫొటోలను తొలగించారు.

బోలెరో వ్యాన్‌ డ్రైవర్‌ అరెస్టు

బొండపల్లి: మండలంలోని నెలివాడ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి26పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు తీవ్రంగా గాయపడడానికి కారణమైన బొలెరో వ్యాన్‌ డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్సై యు.మహేష్‌ తెలిపారు. సీతానగరం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొర్లె శంకర్రావు ఈనెల 14న విజయనగరం నుంచి ద్విచక్ర వాహనంపై సీతానగరం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో గాయపడిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి నిందితుడిని కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్లు తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

కొత్తవలస: మండలంలోని దేవాడ గ్రామంలో ఒక ఇంటి శ్లాబ్‌ పనులకు సంబంధించి రాడ్‌బెండింగ్‌ పనులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై జామి మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన మద్దిల రమణ (33) శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీఐ విజయకుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రమణ రాడ్‌బెడింగ్‌ పనులను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఈ క్రమంలో దేవాడ గ్రామంలో ఒక ఇంటికి శ్లాబ్‌ పనులకు సంబంధించి రాడ్‌బెండింగ్‌ పనులు నిర్వహిస్తుండగా రాడ్‌ కట్‌ చేసే మిషన్‌ హ్యాండిల్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో తీవ్ర షాక్‌కు గురయాడు. దీంతో స్థానికులు చెంతనే గల వియ్యంపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తవలసలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం టౌన్‌: జిల్లా కేంద్రంలోని కమ్మవీధిలో నివాసం ఉంటున్న తియ్యాల గోపి (45) టిఫిన్‌ షాపు పెట్టుకుని భార్య, ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. షాపు పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన గోపీ స్నానం చేయడానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత భార్య జ్యోతిస్వరూప ఎంతపిలిచినప్పటికీ రాకపోయేసరికి తలుపులు కొట్టగా తీయలేదు. లోపల గడియ పెటి ఉందని తెలుసుకున్న ఆమె గట్టిగా తలుపులు తోసి లోపలికి వెళ్లి చూసేసరికి భర్త ఉరివేసుకుని కనిపించడంతో కేకలువేసింది. చుట్టుపక్కల వారు వచ్చి గోపీని కిందకు దించి ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఏ కారణంతో తన భర్త చనిపోయాడో తెలియదని భార్య ఫిర్యాదులో పేర్కొంది. మృతుని భార్య జ్యోతిస్వరూప ఫిర్యాదు మేరకు టూటౌన్‌ సీఐ టి.శ్రీనివాస్‌ కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement