● ఎస్పీలు, ఎస్డీపీఓలతో విశాఖ రేంజ్ ఐజీపీ సమీక్ష
విజయనగరం టౌన్: పోలీసు అధికారులు, సిబ్బంది రాజకీయ ప్రభావాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జెట్టి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల పరిఽధిలో ఉన్న ఎస్పీలతో పాటు ఎసీడీపీఓలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన గ్రామాలను గుర్తించి అవసరమైన పోలీసు బలగాలు, అదనపు సిబ్బంది, రిజర్వు బలగాల మోహరింపునకు పక్కా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. హిస్టరీషీట్లు కలిగిన వారు, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచి, అవసరమైన వారిపై బైండోవర్, చట్టపరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. పెండింగ్ నాన్ బెయిల్బుల్ వారెంట్ల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు రాజకీయ విభేదాలు, వర్గ ఘర్షణలు, ఉద్రిక్తతలకు దారితీసే పరిస్ధితులపై ముందస్తు సమాచారాన్ని సేకరించి, సంబంధిత అధికారులతో తక్షణమే పంచుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి జరిగే సారా, అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఎకై ్సజ్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్లో విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్, పార్వతీపురం మన్య జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి ఇతర జిల్లాల ఎస్పీలు, ఎస్డీపీఓలు పాల్గొన్నారు.


