రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు

● ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించిన బాలురు, బాలికల జట్లు

తెర్లాం: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు సత్తా చాటాయి. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు ప్రథమ స్థానం, బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్‌–17 జూనియర్‌ రాష్ట్ర స్థాయి పోటీలు వైఎస్సార్‌ కడప జిల్లాలో ఈనెల 12 నుంచి 15వరకు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయి. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరచిన జిల్లా బాలురు, బాలికల జట్లు ఫైనల్‌ పోటీలకు చేరాయి. ఫైనల్‌ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు జట్టు కడప జిల్లా జట్టుతో పోటీపడి విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే జిల్లాకు చెందిన బాలికల జట్టు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు జట్లు అత్యుత్తమ ఆటతీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను, వ్యక్తిగత గోల్డ్‌ మెడల్స్‌తోపాటు షీల్డ్‌లను క్రీడాకారులు కై వసం చేసుకున్నారు. ఇరుజట్ల క్రీడాకారులను జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, కోచ్‌లు అభినందించారు. మరిన్ని పోటీల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారంతా ప్రోత్సహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement