కంచరాం విద్యార్థులకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

కంచరాం విద్యార్థులకు పతకాలు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

రాజాం: మండలంలోని కంచరాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ఫెడరేషన్‌ పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 10 నుంచి 13 వరకు పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ పోటీలు జరగ్గా, అండర్‌–17 విభాగంలో 46 కిలోల ప్రీస్టైల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ఎస్‌.అపర్ణ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి, కాంస్యపతకం గెలవగా, ఇదే పోటీల్లో కె.లావణ్య 65 కిలోల ప్రీస్టైల్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయస్థానాన్ని దక్కించుకుని రజతపతకం సాధించిందని పీడీ దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్‌ఎం వై.గౌరునాయుడు, పాఠశాల కార్యదర్శి, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్‌మోహన్‌, పీడీ తాలాడ దుర్గారావు, ఉపాధ్యాయులు పి.వేణుగోపాలరావు, వై.భాస్కరరావు, ఎం.కిషోర్‌, లెంక శ్రీనివాసరావు, బి.మహేష్‌, ఎం.గౌరీశంకర్‌, అరుణ, టి.అనూరాధ, పి.కోటేశ్వరరావు, మంజుల, సుమలత, ముత్యాలమ్మ, సుభాషిణి, లక్ష్మి, పీఈటీ బి.నారాయణనాయుడు తదితరులు శుక్రవారం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement