చదురుగుడిలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు చదురుగుడిలో పుష్పాలంకరణలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్, ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ చలువపందిళ్లు, మజ్జిగ , మంచినీరు, ఉచిత ప్రసాదాల పంపి ణీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పైడిమాంబ ఆదిపీఠం సభ్యులు ఎస్.అచ్చిరెడ్డి, సూర్యపాత్రో, మహేష్ భక్తులకు పులిహోర, దద్దోజనం అందజేశారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి సిబ్బంది భక్తులకు బీపీ, సుగర్ టెస్ట్‌లు ఉచితంగా చేశారు. పైడితల్లి అమ్మవారి అధ్యాత్మిక కళావేదికపై మయూ రి నృత్యాలయ చిన్నారులు వివిధ నృత్యరూపకాలతో భక్తులను అలరించారు.
గుండె నిండుగా దేశభక్తి
భోగాపురం: భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సైనికులు క్షేమంగా ఉండాలని, వారికి మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ పలువురు దివ్యాంగులు భోగాపురం కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేసే శక్తిని భారత సైనికులకు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు. పాక్ దాడిలో అమరుడైన తెలుగు జవాన్ మురళీనాయక్ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో కొమ్మూరు సుభాషణరావు, వరుపుల గిరి, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు చిన్నారావు, వెంకటరమణ, కామేశ్వరరావు,సంతోషి, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.
చదురుగుడిలో పైడితల్లి


