మట్టితవ్వితే చర్యలు
మెరకముడిదాం: మండలంలోని గర్భాం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 311లో ఉన్న ఎర్ర చెరువులో మట్టితవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని గర్భాం మేజర్ పంచాయతీ ఈఓ విశ్వనాథం హెచ్చరించారు. ఈ మేరకు చెరువు గర్భంలో హెచ్చరిక బోర్డును శనివారం ఏర్పాటుచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటీవల చెరువులో మట్టితవ్వకాలు జరుపుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
● గర్భాం ఎర్రచెరువులో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు


