
నిరసన గళం
● ప్రభుత్వ బడిలో చక్కని చదువు
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. చదువుకునేందుకు ఆహ్లాదకర వాతావరణంకల్పించారు. నాడు–నేడు పనులతో పాఠశాలలు బాగుపడ్డాయి. ప్రమాణాలతో కూడిన విద్యను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలంటూ డీఈఓ యు.మాణిక్యంనాయుడు గంట్యాడ మండలం లక్కిడాం గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ బడిలో పిల్లలను చదివించడం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు. – గంట్యాడ