వైద్య రంగంలోనూ ఏఐ వినియోగం | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలోనూ ఏఐ వినియోగం

Nov 27 2026 12:50 AM | Updated on Nov 27 2026 12:50 AM

మహారాణిపేట: కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆధునిక సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రస్తుతం వైద్య రంగంలోనూ దీని వినియోగం విస్తరిస్తోందని ఒడిశా మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కె. హరిబాబు అన్నారు.ఆంధ్రా మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో గురువారం మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హరిబాబు మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతం ఇప్పటికే అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వైద్య సేవల్లోనూ నూతన మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ కరుణాకర్‌, డాక్టర్‌ కె. సుబ్బారావు, డాక్టర్‌ ఫణీంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన 150 మంది విదేశీ, స్వదేశీ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement