సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు | - | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

తాటిచెట్లపాలెం: సుప్రీంకోర్టు ఆదేశాలున్నా పోలింగ్‌ బూత్‌ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. 65వ వార్డు పరిధి ధర్మనగర్‌లో ఆదివారం బూత్‌లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. శనివారమే జీవీఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేవలం 30 శాతం బూత్‌ల వద్దే కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వివక్ష చూపుతూ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement