డాబాగార్డెన్స్: రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డుల్లో విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ ఉత్తమ స్టేషన్‌గా ఎంపికై ంది. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ద్వారకా బస్‌స్టేషన్ ఏటీఎం గంగాధర్ అవార్డును అందుకున్నారు.
సింహాచలం దేవస్థానానికి అవార్డు
సింహాచలం : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి లభించిన ’స్వచ్ఛ ఆంధ్ర–2026’ రాష్ట్ర స్థాయి అవార్డును ఈవో జల్లేపల్లి వెంకటరావు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా అందుకున్నారు.


