కమాండ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా జంధ్యాల శ్రీధర్‌ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

కమాండ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా జంధ్యాల శ్రీధర్‌ బాధ్యతలు

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

సింథియా: తూర్పు నావికాదళ కమాండ్‌ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా రియర్‌ అడ్మిరల్‌ డాక్టర్‌ జంధ్యాల శ్రీధర్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993 జూన్‌ 30న భారత నౌకాదళంలో చేరిన ఆయన విశాఖలోని టింపనీ స్కూల్‌, పుణేలోని ఏఎఫ్‌ఎంసీ పూర్వ విద్యార్థి. చర్మవ్యాధుల వైద్య నిపుణుడైన ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా సేవా అనుభవం ఉంది. కోవిడ్‌ సమయంలో విశాఖలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ కళ్యాణి కమాండింగ్‌ ఆఫీసర్‌గా, ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేవల్‌ మెడిసిన్‌లో డైరెక్టర్‌, డీన్‌గా, ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ, ఐఎన్‌హెచ్‌ఎస్‌ సంజీవనిలో సీనియర్‌ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల కోల్‌కతాలోని కమాండ్‌ హాస్పిటల్‌ (తూర్పు నావికాదళం)లో డెర్మటాలజీ కన్సల్టెంట్‌గా సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement