ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో కొనసాగించాలని, ఓటు హక్కును పరిరక్షించాలని నాయకులు కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుత వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి.పద్మ, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.పైడిరాజు, ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు ఎం.వి.ఎం.పట్నాయక్, ఎస్‌యూసీఐసీ రాష్ట్ర నాయకుడు ఎస్.గోవిందరాజులు, దేవా, ఆర్.కె.ఎస్.వి.కుమార్, బొట్టా ఈశ్వరమ్మ, ఆర్.శ్రీనివాస్, బేగం తదితరులు పాల్గొన్నారు.


