ఉద్యోగుల ఐక్యతతో సంక్షేమం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఐక్యతతో సంక్షేమం సాధ్యం

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

అల్లిపురం: ఉద్యోగుల మధ్య ఐక్యతతోనే సంక్షేమం సాధ్యమని జి. బాలకృష్ణ అన్నారు. సామూహిక సంక్షేమం, సాధికారతతో పాటు సమాజం పట్ల ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరస్పరం సహకరించుకుంటూ సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విశాఖ జోన్‌ ఆధ్వర్యంలో తొలి జోనల్‌ సదస్సు శనివారం నగరంలోని హోటల్‌ వి ప్రైడ్‌లో ఘనంగా నిర్వహించారు. విశాఖ జోన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ ఉద్యోగులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోనల్‌ అధ్యక్షుడు నిమ్మక ప్రతాప్‌ కుమార్‌, జోనల్‌ కార్యదర్శి ఉబ్బెటి మురళీకృష్ణ, జోనల్‌ బృందం ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి సంఘం ప్రతినిధులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్‌ బి. ప్రసాద్‌ నాయక్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి మహేంద్ర నాయక్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి రమణ కిషోర్‌ నాయక్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. విశాఖపట్నం జోన్‌ పరిధిలో ఎస్టీ ఉద్యోగుల ఐక్యత, సామూహిక భాగస్వామ్యం ఈ సదస్సులో ప్రతిబింబించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement