విద్యుదాఘాతానికి గొర్రెల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి గొర్రెల కాపరి మృతి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

15 గొర్రెలు కూడా..

అగనంపూడి: అగనంపూడి సమీపంలో విద్యుద్ఘాతానికి గొర్రెల కాపరితోపాటు 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగనంపూడిలో ఓ ప్రైవేట్‌ లేఅవుట్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం కిత్తన్నపేటకు చెందిన ఉప్పిలి బంగారయ్య (30) కొంతమంది గొర్రెల కాపరులతో కలిసి 800 గొర్రెల మందను తీసుకుని మూడు నెలల క్రితం ఇంటి నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో అగనంపూడి సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో గొర్రెలను మేపుతున్నారు. శనివారం చీకటి పడటంతో మందను తిరిగి తీసుకెళ్లేందుకు వెళ్లారు. 15 గొర్రెలు ఒకేచోట ఉండటంతో వాటిని తోలుకొచ్చేందుకు బంగారయ్య వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ వైరు తెగిపడి ఉండటాన్ని గమనించక దానిని తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే తీగను తాకిన 15 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె నిత్య, కుమారుడు చరణ్‌ ఉన్నారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంగారయ్య మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement