సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ విశాఖ జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల్లో పలువురిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కర్రి వెంకట సంతోష్ అప్పారావు (పెందుర్తి), జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఇరోతి గణేష్ (గాజువాక), జిల్లా పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా శివలంక డేవిడ్ జేమ్స్ రాయ్ (గాజువాక), జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా కొణతాల సుమన్ (గాజువాక)ను నియమించారు.


