ముడసర్లోవకు కొత్త నీరు | - | Sakshi
Sakshi News home page

ముడసర్లోవకు కొత్త నీరు

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

2 రోజుల వర్షాలకు

3 అడుగులు పెరిగిన నీటి మట్టం

ఆరిలోవ: ముడసర్లోవ జలాశయంలో వరద నీరు చేరుతోంది. వర్షాకాలం వచ్చి నెలలు గడుస్తున్నా.. సరైన వానలు లేకపోవడం, దీనికి తోడు ఎండల ప్రభావంతో రిజర్వాయర్‌ దాదాపుగా అడుగంటిపోయింది. ఆరిలోవ ప్రాంతానికి తీవ్ర తాగు నీటి సమస్య నెలకొంది. గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు కంబాలకొండలు నుంచి వరద నీరు చేరడంతో జలకళ వచ్చింది. బుధవారం నాటికి మూడు అడుగులు కొత్త నీరు చేరినట్లు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం 151.4 అడుగులు ఉన్న నీటి మట్టం వరద నీటి రాకతో 154.4కు చేరినట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌కు నీటి చేరికతో భూగర్భ జలాలు కూడా కొంత మేర పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం కొండలు నుంచి వరద నీరు రాకుండా అడ్డుకట్టపడిందని, లేకుంటే మరింతగా నీరు చేరేదని చెప్తున్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ పనుల కోసం నీటి దారులు మూసేయడంతో ఆ కొండల నుంచి వరద నీరు జలాశయానికి వచ్చే వీల్లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement