రూ.50 లక్షల భవనం.. వర్షం పడితే వాటర్‌ఫాల్‌! | - | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల భవనం.. వర్షం పడితే వాటర్‌ఫాల్‌!

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోనల్‌ ఆఫీస్‌ చూశారా? అక్షరాలా రూ.50 లక్షల ప్రజాధనంతో చేసిన అద్భుత పునరుద్ధరణ పనుల తీరు చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే! రూ.కోట్లు పెట్టి కట్టిన కొత్త భవనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రారంభించి ఏడాది కూడా నిండకుండానే ఈ కార్యాలయం నాణ్యతలో డొల్లతనం బట్టబయలైంది. కొద్దిపాటి వర్షానికే భవనం పైకప్పు నుంచి జోరుగా నీరు కారుతుంటే, అధికారులకు వాటర్‌ ఫాల్స్‌ చూడటానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనే లేకుండా పోయిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు..! ఇక్కడ ఫ్లోర్‌కు వేసిన టైల్స్‌ మరీ విచిత్రం. చిన్న నీటి చుక్క పడిందంటే చాలు.. సర్కస్‌ ఫీట్లు చేయకుండానే నేలమీద గాల్లోకి ఎగిరి పడొచ్చు. జోన్‌కు పలు సమస్యలపై వచ్చే ప్రజలకు ఈ అడ్వెంచర్‌ రైడ్‌ పూర్తిగా ఉచితం. సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. విలువైన ఫైల్స్‌, ఖరీదైన కంప్యూటర్లు ఎక్కడ కొట్టుకుపోతాయోనని.. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ ఇంజినీరింగ్‌ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ అద్భుత కట్టడానికి మరమ్మతుల పేరుతో ఇంకెంత మొత్తం స్వాహా చేస్తారో.. ఉన్నతాధికారులే సెలవివ్వాలి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement