టౌన్‌ ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరంలో 117 వినతులు | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరంలో 117 వినతులు

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

అల్లిపురం: ఏపీడీపీఎంఎస్‌, టీడీఆర్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన టౌన్‌ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరంలో 117 వినతులు వచ్చాయి. వినతుల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ 83, టీడీఆర్‌ 30, ఏపీడీపీఎంఎస్‌ 4 వినతులు ఉన్నాయి. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా ఏపీడీపీఎంఎస్‌లో 19, ఎల్‌ఆర్‌ఎస్‌లో 68, టీడీఆర్‌లో 17 దరఖాస్తులు పరిష్కరించారు. అదనంగా 48 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఎల్‌టీపీలు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ మాట్లాడుతూ ఏపీడీపీఎంఎస్‌, టీడీఆర్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement