మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ కృష్ణ స్వామి సహిత సంపత్ వినాయకుడిగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, గణపతి హోమం, సామవేద పారాయణం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో 2,100 మందికి భోజనం వడ్డించగా, ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. కోలాటం, భజన, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.


