అల్లిపురం: జీవీఎంసీ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి వార్డుల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలను మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల సేకరణకు సిబ్బంది వార్డు స్థాయిలో సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ సర్వే కీలకమని, పౌరులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్ల వివరాలు
(సెప్టెంబర్ 22, 2026 నాటికి)
జీవీఎంసీలోని 120 వార్డుల పరిధిలో మొత్తం 18,29,966 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,02,171 మంది పురుషులు, 9,27,676 మంది మహిళలు, 119 మంది ఇతరులు ఉన్నారు.
నేటి నుంచి కేటగిరీల వారీగా సర్వే


