ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

రైల్వే అధికారులకు జీఎం

సందీప్‌ మాధుర్‌ ఆదేశాలు

తాటిచెట్లపాలెం: బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సౌత్‌ కోస్ట్‌ రైల్వే జీఎం సందీప్‌ మాథుర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రిన్సిపల్‌ హెడ్స్‌, నాలుగు డివిజన్ల (విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు) డీఆర్‌ఎంలతో ప్రత్యేక భద్రతా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యాత్మక బ్రిడ్జిలు, ట్రాక్‌లు, యార్డుల వద్ద 24/7 నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సహాయార్థం హెల్ప్‌లైన్‌ సెంటర్లు, సరిపడా ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం పవర్‌ బ్యాకప్‌, డీజిల్‌ లోకోలు, ప్రమాద సహాయక రైళ్లు, విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement