గురజాడ భావితరాలకు స్ఫూర్తిదాత | - | Sakshi
Sakshi News home page

గురజాడ భావితరాలకు స్ఫూర్తిదాత

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

మహారాణిపేట: ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు జయంతిని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ రచనలు సమాజంలో నెలకొన్న అసమానతలు, మూఢనమ్మకాలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయని డీఆర్వో పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె.మాధవి, డిప్యూటీ కలెక్టర్లు టి. గోవిందు, శేషశైలజ, ఏడీసీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement