పీజీఆర్‌ఎస్‌లో ప్రజాగళం | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌లో ప్రజాగళం

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి, దళిత సంఘాల ప్రతినిధులు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వీధి విక్రయదారులకు ఉపాధి రక్షణ కల్పించడం నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో మౌలిక వసతులు, జీవీఎంసీ మేయర్‌ పదవి దళితులకు రిజర్వు చేయడం, మెడికల్‌ మాఫియాపై చర్యలు తీసుకోవడం వరకు పలు అంశాలపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

మేయర్‌ పదవి దళితులకే ఇవ్వాలి

రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పదవిని దళితులకు రిజర్వు చేయాలని పలు దళిత, బహుజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జీవీఎంసీలో 120 వార్డుల ప్రాతిపదికన ఎస్సీలకు 19, ఎస్టీలకు 8 వార్డులు రిజర్వు చేయాలని, గతంలో రిజర్వేషన్ల కేటాయింపులో రాజ్యాంగ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ మెమోరియల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి జేవీ ప్రభాకర్‌, సహాయ కార్యదర్శి బత్తుల గౌతమ్‌ బాబు, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశరావు, ఆర్‌పీఐ (అంబేడ్కర్‌ ) ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొంగరపు గణపతి, భారత్‌ సమాజ్‌ డెవెలప్‌ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చింతాడ సూర్యం, డీహెచ్‌పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల రాంబాబు, రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ జోనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పివిఆర్‌ మోహన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలి

జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో జరుగుతున్న మెడికల్‌ మాఫియా ఆగడాలను అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌వైఎస్‌ఎఫ్‌ నాయకులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని రైట్స్‌ ఫర్‌ యూత్‌ అండ్‌ స్టూడెంట్స్‌ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామల లక్ష్మారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పడమట నరేష్‌, జిల్లా కన్వీనర్‌ ఎన్‌.శ్రీను హెచ్చరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల యాజమాన్యాలు కుమ్మకై ్క కమీషన్ల కోసం అవసరం లేకపోయినా అనేక రకాల టెస్టుల పేరుతో పేద ప్రజలను పీడిస్తున్నారన్నారు.

వీధి విక్రయదారులను ఆదుకోవాలి

రైల్వే, ఆర్‌పీఎఫ్‌, జీవీఎంసీ అధికారులు తమను వ్యాపారం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి విక్రయదారులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించి యథావిధిగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బీసీ స్టడీ సర్కిల్‌లో వసతులు కల్పించాలి

జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్‌ అభ్యర్థులకు తగిన మౌలిక వసతులు కల్పించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మరుగుదొడ్ల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement