సీతంపేట: నగరంలో తొలిసారిగా ఈ నెల 25, 26 తేదీల్లో బీచ్‌రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్‌లో ‘ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎక్స్‌పో, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పో–2026’ను నిర్వహించనున్నట్లు ఏపీ సోలార్ ఇంటిగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఏపీ శివ) అధ్యక్షుడు బి.విశ్వప్రసాద్ తెలిపారు. సీతంపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎక్స్‌పో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఫస్ట్ వ్యూ, సోలార్ క్వార్టర్ సంస్థలు సంయుక్తంగా ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తుండగా, తమ అసోసియేషన్‌ను పార్టనర్‌గా ఎంపిక చేశాయన్నారు. ఎక్స్‌పోలో సుమారు 100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ప్రజలకు పరిచయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. సోలార్‌తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(బీఈఎస్‌ఎస్), ఇన్వర్టర్లు, సోలార్ మాడ్యూల్స్, కేబుల్స్ తదితర అధునిక పరికరాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ శివ సలహాదారు కమ్ కోర్ కమిటీ సభ్యుడు కె.గోపాల్ రెడ్డి, కోశాధికారి పీటీవీఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.


