ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

● పీజీఆర్‌ఎస్‌లో అధికారులతో జేసీ విద్యాధరి ● వివిధ సమస్యలపై 450 వినతులు

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఎస్డీసీలు టి.గోవిందు, శేషశైలజ, జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తిలతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 450 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 56, జీవీఎంసీ 108, పోలీస్‌ శాఖ 31, ఇతర శాఖలకు సంబంధించినవి 255 ఉన్నాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement