జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 108 వినతులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 108 వినతులు

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు 108 వినతులు అందాయి. అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, ఎస్‌ఎస్‌ వర్మతో కలిసి కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో జోనల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 4, జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగానికి 9, రెవెన్యూ 11, ప్రజారోగ్య శాఖ 6, అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 52 రాగా, ఇంజినీరింగ్‌ సెక్షన్‌కు 22, డీడీహెచ్‌కు 2, యూసీడీకి 2 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి సంబంధిత అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌(అమృత్‌) డి.విజయభారతి, డీసీఆర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ప్రధాన వైద్యాధికారి(ఇన్‌చార్జి) డాక్టర్‌ కృష్ణంరాజు, యూసీడీ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ బీవీ రమణ, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, పర్యవేక్షక ఇంజినీర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement