ఇద్దరికి తీవ్రగాయాలు
పెందుర్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. మన్యం జిల్లా కల్లికోటకు చెందిన బోని రాంబాబు (22) తెనాలిలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. గాజువాకలో ఉంటున్న తన అక్క ఇప్పిలి ధనలక్ష్మి, ఆమె కుమారుడు దేవ్‌తో కలిసి రాంబాబు సొంత గ్రామమైన కల్లికోటకు వెళ్లాడు. తిరిగి ఆదివారం ముగ్గురూ బైక్‌పై ఆనందపురం హైవే మీదుగా పెందుర్తి వైపు వస్తున్నారు. అక్కిరెడ్డిపాలెం వద్ద మలుపు దాటిపోవడంతో బైక్‌ను వెనక్కి తిప్పుతుండగా.. వెనుక నుంచి వచ్చిన వ్యాన్ బుల్లె ట్‌ను ఢీకొట్టింది. రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా ధనలక్ష్మి, దేవ్‌కు గాయాలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పెందుర్తి సీఐ సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


