మహారాణిపేట: నగరంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ స్టాప్ నుంచి భగత్‌సింగ్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. నగరంలో తాగునీటి సమస్యను మరింత పెంచే డేటా సెంటర్లను రద్దు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించని డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రీన్ విశాఖకు చెందిన జయశ్రీ హటాంగిడి, దీక్ష, గ్రీన్ విశాఖ కోశాధికారి జి. కాంతారావు, కె. తిరుపతిరావు, అజయ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
ఆర్కే బీచ్ వద్ద
నిరసన తెలియజేస్తున్న యువతీయువకులు


