జీవీఎంసీ వార్డుల పునర్విభజన అశాసీ్త్రయం | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ వార్డుల పునర్విభజన అశాసీ్త్రయం

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌

అధికారుల తీరు ఆక్షేపణీయం

వార్డుల పునర్విభజన

తప్పులు సరిదిద్దకపోతే ఉద్యమిస్తాం

వార్డుల విభజనపై జనసేన ఎమ్మెల్యే

పంచకర్ల మండిపాటు

పెందుర్తి: జీవీఎంసీ వార్డుల పునర్విభజన తీరుపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొన్ని వార్డుల విభజన చాలా అశాసీ్త్రయంగా జరిగిందని ఆక్షేపించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యపూరితంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెందుర్తిలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధి 92వ వార్డులో ఉన్న కొంత భాగాన్ని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డులో కలపడాన్ని తప్పుబట్టారు. ఒకవేళ 92వ వార్డులో జనాభా ఉంటే పక్కనే ఉన్న వార్డుల్లో కలపాలి తప్ప.. దాదాపు 10 కి.మీ. పైగా దూరం ఉన్న 88వ వార్డులో విలీనం చేయడమేంటని ప్రశ్నించారు. ఓ కార్పొరేటర్‌ను కలవాలంటే ప్రజలు అంత దూరం వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ చర్య చాలా దుర్మార్గంగా, అమానుషంగా ఉందన్నారు. జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు కోరితే తాము పై ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించి, తగు సూచనలు కూడా చేశామన్నారు. అయితే ఓ ఎమ్మెల్యే వినతిని కూడా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. శాసనసభ్యుడిగా తన లేఖకు, ప్రజల అర్జీలకు విలువ లేకపోయిందన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ సహా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా తప్పులను వెంటనే సరిదిద్దకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని పంచకర్ల ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement