ఉద్యోగుల ఎదుగుదల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఎదుగుదల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకం

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

విశాఖ లీగల్‌: ఉద్యోగులు ఉన్నతంగా ఎదగడంలో తల్లిదండ్రుల పెంపకం, బాల్యదశ కీలకమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ న్యాయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పైల సన్నిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఇటీవల నజీర్‌గా పదోన్నతి పొందిన గారపాటి కొండబాబును బుధవారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్నిబాబు మాట్లాడుతూ కొండబాబు ఉన్నత వ్యక్తిత్వం, మృదుస్వభావం కార్యశీలత కూడిన వ్యక్తిగా కొనియాడారు. ఎందరో న్యాయమూర్తులు దగ్గర తలలో నాలుకగా ఎదిగిన కొండబాబు ఉద్యోగులందరికీ ఆదర్శమన్నారు. నజీర్‌ కొండబాబు మాట్లాడుతూ అందరి సహకారంతోనే తానీస్థాయికి ఎదిగానన్నారు. అధికారులకు, న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, న్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు, సంఘం ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని కొండబాబును అభినందించారు.

అప్పన్న సన్నిధిలో ఆర్థికశాఖ ఉన్నతాధికారుల బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement