గణేష్‌ నిమజ్జన కోలాహలం | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జన కోలాహలం

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

ఆరిలోవ: జోడుగుళ్లపాలెం బీచ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలతో బుధవారం సాయంత్రం నుంచి సందడి నెలకొంది. ఆరిలోవ, విశాలాక్షినగర్‌, ఆదర్శనగర్‌, ఎంవీపీ కాలనీ, లాసన్స్‌ బే కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, ఇసుకతోట, మద్దిలపాలెం, పిఠాపురం కాలనీ, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం కోసం తీరం వద్దకు తీసుకొచ్చారు. మూడు రోజుల గణేష్‌ ఉత్సవాల అనంతరం బుధవారం అనుపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాల నుంచి భక్తులు విగ్రహాలను ఊరేగింపుగా తీరం వద్దకు తీసుకువచ్చి ‘జైజై గణేశా.. బైబై గణేశా’అంటూ వీడ్కోలు పలికారు. విగ్రహాలను గజ ఈతగాళ్లకు అప్పగించగా, వారు సముద్రంలో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆరిలోవ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement