అగనంపూడి: ఆర్‌ఈసీఎస్ పరిధిలోని కశింకోట సబ్ డివిజన్‌లో ఇప్పటివరకు కొనసాగిన అగనంపూడి సెక్షన్ కార్యాలయాన్ని బుధవారం నుంచి విశాఖ డివిజన్ ఆటోనగర్ సబ్ డివిజన్‌లో విలీనం చేస్తూ ఏపీ ఈపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. అగనంపూడి ప్రాంతం ప్రస్తుతం విశాఖ జిల్లా పరిధిలో ఉండటంతో బీహెచ్‌పీవీ సమీపంలోని ఏడీఈ కార్యాలయంతో కూడిన ఆటోనగర్ సబ్ డివిజన్ పరిధిలోకి బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సబ్ సెక్షన్ కార్యాలయాన్ని ఏఈ కార్యాలయంగా మార్చినట్లు తెలిపింది. అయితే అగనంపూడి కార్యాలయ సిబ్బంది ఆర్‌ఈసీఎస్‌లోనే కొనసాగుతారని ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


