సింథియా: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని 420 మంది దివ్యాంగులకు రూ.35 లక్షల వ్యయంతో సహాయక పరికరాలను అందజేసింది. మంగళపాలెంలోని శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హాస్పిటల్‌లో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు కృత్రిమ అవయవాలు, వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కాలిపర్లు, చేతికర్రలు, వైట్ కేన్లతో పాటు పలు ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షిప్‌యార్డ్ సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామరన్ మాట్లాడుతూ... సమాజ సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ వైద్య బృందం, స్వచ్ఛంద సేవకుల కృషిని అభినందించారు.


