బాలగణపతి అలంకరణలో సంపత్‌ వినాయకుడు | - | Sakshi
Sakshi News home page

బాలగణపతి అలంకరణలో సంపత్‌ వినాయకుడు

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలు, కటౌట్లతో అలంకరించారు. సోమవారం సంపత్‌ వినాయకర్‌ అలంకరణలో, మంగళవారం శ్రీ బాలగణపతి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణు సహస్రనామ పారాయణం, భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించారు. మంగళవారం అన్నదానం చేపట్టగా.. ఈనెల 23న మహా అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆశీలమెట్ట రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి సిరిపురం వెళ్లే మార్గంలో వాహనాలు బారులు తీరడంతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement