● ఏకదంతం.. విభిన్న రూపం | - | Sakshi
Sakshi News home page

● ఏకదంతం.. విభిన్న రూపం

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

షీలానగర్‌లో ఖర్జూరంతో గణపతి

విఘ్నాలను తొలగించే వినాయకుడు.. భక్తుల ఊహలకు అనుగుణంగా విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు. విశాఖ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడిని ప్రత్యేక ఆకృతుల్లో కొలువుదీర్చారు. ఫైర్‌మెన్‌ గణపతి నుంచి పెద్ది, గోవా, భవానీ మాలధారుడు, గాజులు, పసుపుకొమ్ములు, పప్పుదినుసులు, ఖర్జూరం, రుద్రాక్ష గణపతి తదితరఆకట్టుకునే రూపాలు కొలువుదీరాయి. క్రికెటర్‌ అవతారంలో దర్శనమిస్తున్న గణపతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. సంప్రదాయ భక్తి.. సృజనాత్మకత మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ గణేశ విగ్రహాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన ఏకదంతుడి వైభవాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.

– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్‌–విశాఖపట్నం

రెల్లివీధి పెద్ది గణేశుడు

పెయిందొరపేటలో...

కోటవీధిలో ఝాన్సీరాణిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement