ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా సాహితి | - | Sakshi
Sakshi News home page

ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా సాహితి

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖకు చెందిన అంతర్జాతీయ చెస్‌ మాస్టర్‌ మూగి సాహితి వర్షిణి ‘ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌’(డబ్ల్యూజీఎం) హోదాను సాధించారు. సెర్బియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ టోర్నీలో మూడో, తుది డబ్ల్యూజీఎం నార్మ్‌ను పూర్తి చేసి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

ప్రధాన విజయాలు: సెర్బియా టోర్నీలో 9 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు ఫ్రాన్స్‌లో ‘బెస్ట్‌ ఉమెన్‌ ప్లేయర్‌’గా నిలవడంతో పాటు, హంగేరీ ఓపెన్‌లో రెండో డబ్ల్యూజీఎం నార్మ్‌ను దక్కించుకున్నారు.

రికార్డులు: విశాఖ నుంచి ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌(డబ్ల్యూఐఎం) టైటిల్‌ సాధించిన తొలి మహిళా చెస్‌ క్రీడాకారిణిగా సాహితి గతంలోనే గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచి తండ్రి లోకేశ్వరరావు పర్యవేక్షణలో శిక్షణ పొందుతూ నేడు ఈ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement