విశాఖ విద్య: మాజీ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆళ్ల నాని ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం సేవలందించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఆయనకు శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారని ఈ సందర్భంగా తెలిపారు. సీతమ్మధారలో ఉన్న నాని నివాసానికి వెళ్లి, ఆయన భౌతిక కాయనికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
● టీడీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక మృతి పట్ల విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు సంతాపం తెలిపారు. నాని అకాల మరణం రాజకీయ, ప్రజా జీవితానికి తీరని లోటన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఆళ్ల నాని భౌతికకాయానికి నివాళులర్పించారు.


