డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

మహారాణిపేట: తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ ఎస్‌.కె.ఆశ అన్నారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. గత కొద్ది రోజుల నుంచి వివిధ రకాల పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. దీంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్‌ కిషోర్‌రావు, జేఏసీ నాయకుడు శివప్రసాద్‌, పైడిరాజు, సతీష్‌ కుమార్‌, బి.నాగేంద్రకుమార్‌, ప్రసాదరావు, పీకే రాజు, కె.నాగిరెడ్డి, బి.నాగేంద్ర కుమార్‌, పి.రాజశేఖర్‌, సతీష్‌ కుమార్‌, ఉమెన్‌ వింగ్‌ చైర్మన్‌ పి.పద్మావతి, ప్రతినిధులు కె.పద్మావతి, ఏపీ బిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement