పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా శోభన్‌ బాబు | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా శోభన్‌ బాబు

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

విశాఖ లీగల్‌: విశాఖ జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ న్యాయవాది జి.శోభన్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. విశాఖ జిల్లా కోర్టు పరిధిలోని క్రిమినల్‌ కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు. శోభన్‌బాబు గతంలో దివంగత న్యాయవాది వెంకటరత్నం వద్ద జూనియర్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, క్రీడా సాంస్కృతిక సంఘం కార్యదర్శి వేల్పుల సురేష్‌బాబు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.కృష్ణమోహన్‌, బి.వి.ఆర్‌.మూర్తి, కె.రామ జోగేశ్వరరావు, నాగశ్రీ, డి.మంజులత అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement