ఎవరెస్టు బేస్ క్యాంప్‌నకు మేడివాడ విద్యార్థి ఎంపిక
రావికమతం: మండలంలో మేడివాడకు చెందిన విద్యార్థి కోట్యాడ రాము ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు దివ్యాంగుల విభాగంలో ఎంపికై నట్లు మేడివాడ హైస్కూల్ ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు తెలిపారు. లడక్‌లో సన్నాహక శిక్షణ కార్యక్రమానికి ఎంపికై నట్లు వారు చెప్పారు. రాము గతంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిబిరానికి జోనల్ స్థాయిలో జరిగిన అడ్వెంచర్ స్పోర్ట్స్ మీట్‌లో విశేష ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో జరిగే శిక్షణకు ఎంపికయ్యాడు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటలో నెల రోజుల పాటు శిక్షణ పాల్గొన్నాడు. శిక్షణ అనంతరం నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి మూడో దశలో లడక్‌లో జరిగే శిక్షణకు ఎంపికయ్యాడు. రాము ప్రసుత్తం కొత్తకోట జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.


