ఆరు పదుల వయసులో మెరుపు వేగం | - | Sakshi
Sakshi News home page

ఆరు పదుల వయసులో మెరుపు వేగం

Feb 22 2026 6:56 AM | Updated on Feb 22 2026 6:56 AM

ఆరు పదుల వయసులో మెరుపు వేగం

ఆరు పదుల వయసులో మెరుపు వేగం

కాంస్య పతకం, సర్టిఫికెట్‌ను అందుకుంటున్న కోదండరావు

విశాఖ సిటీ: వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని జిల్లాకు చెందిన కోదండరావు (60) నిరూపించారు. ఆరు పదుల వయసులోనూ యువకుడిలా పరుగెత్తి, జాతీయ స్థాయిలో పతకం సాధించి అందరినీ అబ్బురపరిచారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిర్వహించిన 45వ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (2026–27)లో ఆయన తన ప్రతిభను చాటారు. 400 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన కోదండరావు, మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఈ వయసులోనూ జాతీయ వేదికపై ఆయన సాధించిన విజయం పట్ల తోటి క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement