వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కమిటీతో పాటు, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగ కమిటీల్లో పలువురిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యా యి. పార్టీ జిల్లా అధికార ప్రతినిధులుగా మువ్వల లక్ష్మి(విశాఖ తూర్పు), భోగవల్లి గోవింద్(విశాఖ ఉత్తర) నియమితులయ్యారు. బీసీ సెల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా చోడిపల్లి శివకుమార్(విశాఖ దక్షిణ), అంగన్‌వాడీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కర్రి రమ్య జ్యోతి(విశాఖ దక్షిణ), వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వడ్లపూడి శ్రీనివాసరావు(విశాఖ పశ్చిమ), యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా కండవల్లి రోహిత్ (విశాఖ ఉత్తర), ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శిగా ఉరిటి కృష్ణ ప్రసన్న(విశాఖ ఉత్తర)లను నియమించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా పైల ప్రసాద్, విశాఖ దక్షిణ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా చింతలపల్లి లీలా కృష్ణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా పిల్లా కృష్ణానందబాబు, విశాఖ పశ్చిమ అంగన్‌వాడీ వింగ్ అధ్యక్షుడిగా కాకి గౌరి నియమితులయ్యారు.


