రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెందుర్తి: పెందుర్తి మండలం రాంపురం సమీపంలోని సాధూమఠం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. వివరాలివి.. అనకాపల్లి కొత్తురుకు చెందిన పిలకా లక్ష్మినరసింహమూర్తి, అతడి భార్య కొసకంచి కల్యాణిలక్ష్మి(43) కలిసి అనంతగిరిలో ఉన్న మూర్తి తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలో సాధూమఠం వద్దకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్‌పైకి బైక్ సడన్‌గా వెళ్లడంతో వెనుక కూర్చున్న కల్యాణి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. వెంటనే స్పందించిన భర్త మూర్తి ఆటోలో ఆమెను పెందుర్తి సీహెచ్‌సికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


