వైఎస్ జగన్‌తో వాసుపల్లి భేటీ
కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం
డాబాగార్డెన్స్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ విశాఖ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తన కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్‌ను కలిసి.. తన రెండో కుమారుడు గోవింద సాకేత్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే పట్టువస్త్రాలు, సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని వైఎస్ జగన్‌కు బహూకరించారు. జగన్‌ను కలిసిన వారిలో వాసుపల్లి దంపతులతో పాటు, పెద్ద కుమారుడు సూర్య, కోడలు రాశి, చిన కుమారుడు గోవింద సాకేత్ ఉన్నారు.


