చూసొద్దామా.. ఫ్లవర్ షో
డాబాగార్డెన్స్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఈ పుష్ప ప్రదర్శన ఎంతో నయనానందకరంగా ఉందని, నగర వాసులకు ఇది కనువిందు చేస్తుందని ప్రశంసించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. ఈ ఫ్లవర్ షో మూడు రోజుల పాటు కొనసాగుతుందని, నగర ప్రజల కోసం ప్రవేశం ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యదర్శి మురళీకృష్ణ, చీఫ్ ఇంజినీర్ వినయ్‌కుమార్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పా, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్, ఇన్‌చార్జి డీఎఫ్‌వో వరుణ్‌కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
చూసొద్దామా.. ఫ్లవర్ షో
చూసొద్దామా.. ఫ్లవర్ షో
చూసొద్దామా.. ఫ్లవర్ షో
చూసొద్దామా.. ఫ్లవర్ షో


