హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరగాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు
విశాఖ లీగల్ : జిల్లా కోర్టు ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగినప్పుడే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి లభిస్తుందని పేర్కొన్నారు.న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి ఎల్. పార్వతీ కుమార్ , రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్, కె. రామ జోగేశ్వరరావు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


